Site icon NTV Telugu

Nvss Prabhakar: జోగులాంబను మరిచిపోయారా?

Prabhakar

Prabhakar

తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ వార్ నడుస్తోంది. కృష్ణా పుష్కరాల సమయంలో జోగులాంబ ఆలయాన్ని కేసీఆర్ సందర్శించి… అభివృద్ధి చేస్తామని ప్రకటించారు మరిచిపోయారా అని ప్రశ్నించారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. జోగులాంబ ఆలయం ఇప్పటి వరకు ఎందుకు అభివృద్ధి చేయలేదో సమాధానం చెప్పాలన్నారు.
Read Also: Dr K.Lakshman: మోకాళ్ళ యాత్ర చేసినా జనం నమ్మరు

ఒకనాడు మహబూబ్ నగర్ ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న జిల్లా ప్రజలకు కన్నీరే మిగిల్చారు. బండి సంజయ్ పాదయాత్రను విమర్శించే మంత్రులు కృష్ణా నదిలో మూడు మునకలు మునగాలి. మంత్రివర్గంలో పనిలేని, పనికిరాని మంత్రులు ఎక్కువయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పటడుగులు వేస్తున్నారు. కృష్ణా నీటి వాటా పెంచడంలో టీఆర్ఎస్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారని ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ కేబినెట్ లో పని లేని మంత్రులు, పనికి మాలిన మంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు.

Exit mobile version