NTV Telugu Site icon

Nude Photo Case: స్కానింగ్ సెంటర్ లో న్యూడ్ ఫోటోల కేసు.. మరో బడా ఆసుపత్రిలో..

Nizamabad Ayyappa Scaning Center Nude Photos

Nizamabad Ayyappa Scaning Center Nude Photos

Nude Photo Case: తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ ప్రశాంత్ వ్యవహారం సంచలనంగా మారింది. తీగ లాగితే డొంక కదులుతుంది. ఆపరేటర్ ప్రశాంత్.. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ తో పాటు మరో బడా ఆసుపత్రిలో మహిళల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు. వైద్యుని ఛాంబర్ లో.. స్టెతస్కోప్ వేసుకుని వైద్యునిలా బిల్డ్ అప్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతే అలర్ట్ అయ్యారు. జిల్లాలో 120 స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు 50 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ ప్రశాంత్ అరెస్ట్ చేశారు. 10 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

Read also: Varshangalkku Shesham OTT: ఓటీటీలో మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగులో స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

రెండు సెంటర్ల లో ఒకే వ్యక్తి మహిళల అశ్లీల విడియోలను సెల్ ఫోన్ తో చిత్రీకరించినట్లు పోలీసుల గుర్తించారు. మెడికల్ స్టాఫ్ కు మాత్రమే స్కానింగ్ సెంటర్ లోకి అనుమతించాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. స్కానింగ్ సెంటర్ లో తేడా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాలు జారీచేశారు. అయితే బాధిత మహిళ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారడంతో న్యూడ్ ఫోటో ల చిత్రీకరణ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు నోటీసు లు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం నిజామాబాద్‌ లో చర్చకు దారితీసింది. స్కానింగ్‌ సెంటర్లకు వెళ్లాలంటే మహిళలు, యువతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
AP Elections 2024: ఏపీలో కౌంటింగ్కు కొనసాగుతున్న ఏర్పాట్లు.. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం..!

Show comments