Hyderabad : ఐపీఎస్ అధికారిణిని వేధించిన NRI అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని ఓట్రక్ డ్రైవర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలో ఉంటూ భారత్‌లోని ఓ ఐపీఎస్ అధికారిణికే మెసేజ్‌లు పంపించాడు ప్రబుద్ధుడు. ఆమె కదలికలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ వచ్చాడు. వాటి వివరాలను కూడా ఆమెకు మెసేజ్ చేసేవాడు. చివరకు ఆమెను కలిసేందుకు హైదరాబాద్ వచ్చి కటకటాలపాలయ్యాడు.
ఇక వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన ఘల్ రాజు కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్న అతనికి గ్రీన్ కార్డు హోల్డర్ కూడా ఉంది. సోషల్ మీడియాలో ఓ ఐపీఎస్ అధికారిణి చూసి చాటింగ్ స్టార్ట్ చేశాడు. ముందు హాయ్ హలో అంటూ మొదలైన చాటింగ్ తర్వాత వేరే ట్నర్ తీసుకుంది. అయితే రాజు పంపించిన మెసేజ్‌లకు దేనికి కూడా ఆ అధికారిణి స్పందించలేదు. ఇలాంటి చాలా వస్తుంటాయని లైట్ తీసుకున్నారు.
Also Read
- Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్‌స్టా స్టోరీ!
- Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
- Pak ISI: తప్పిన పెను ప్రమాదం.. పాకిస్తాన్ ISI ఉగ్రవాద ముఠాను పట్టుకున్న పోలీసులు..
- Honour Killing: గోల్కొండలో ఘోరం.. యూట్యూబర్‌ను వెంటాడి చంపిన వైనం..!
రాజు మాత్రం ఆమెకు మెసేజ్‌లు చేస్తూనే ఉన్నాడు. ఆమె చూస్తున్నారా లేదా అనే ఆలోచన లేకుండా మెసేజ్‌లు పంపిస్తూనే వచ్చాడు. ఆమె ఎక్కడకు వెళ్తున్నారు… ఏం చేస్తున్నారు లాంటి అన్ని వివరాలు తెలుసుకుంటున్నాడు. ఇంత చేస్తున్నా ఆమె లైట్ తీసుకున్నారు. ఇలాంటి పోకిరీలు చాలామంది ఉంటారులే అనుకున్నారు. పంజాబ్ కేడర్‌కు చెందిన ఆ ఐపీఎస్ అధికారిణి… ట్రైనింగ్ కోసం జనవరి 17 నుంచి ఏప్రిల్ 29 వరకు హైదరాబాద్ వచ్చారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ లోనే ఉంటూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఓ రోజు సడెన్‌గా ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు రాజు.
రాజు అలా హైదరాబాద్ రావడంతో షాక్ అయ్యారు సదరు ఐపీఎస్ అధికారిణి. ఆమెతో మాట్లాడేందుకు రాజు ట్రై చేశాడు. ఆమె రిజెక్ట్ చేశారు. హెచ్ఆర్డీ లోపలికెళ్లి మహిళా ఐపీఎస్ అధికారిణి వేధింపులకు గురిచేశాడు. ఇది ఇంకా డ్రాగ్ చేస్తే ప్రమాదమని గ్రహించిన ఆమె విషయాన్ని జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐపీఎస్ అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక ఐపీఎస్ అధికారినే వేధించడమే కాకుండా ఆమెకు అసభ్యకరమైన మెసేజ్ పంపిన అలౌక్ పై తగినచర్యలు తీసుకుంటామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
Asani Cyclone: తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష
- Tags
- arrested
- harassing
- IPS officer
- NRI
తాజావార్తలు
-
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్‌పై 3-1 తేడాతో.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్‌తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!