NTV Telugu Site icon

Government Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో 16,940 పోస్టులకు నోటిఫికేషన్లు రెడీ..!

Cs Somesh Kumar

Cs Somesh Kumar

తెలంగాణలో వరుసగా వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి.. అయితే, నిరుద్యోగులకు మరో శుభవార్త.. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి.. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ వెల్లడించారు.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్న ఆయన.. మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ప్రకటించారు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌పై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మెన్ జనార్దన్ రెడ్డితో కలసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఉద్యోగుల నియామక ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.. నియామకాల ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతోపాటు, రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.. సర్వీస్ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టీఎస్‌పీఎస్సీకి వెంటనే సమాచారం అందిస్తే, వాటి ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీ చేస్తుందని తెలిపారు.. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని.. సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌..

Read Also: IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్‌ల బదిలీ.. సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య