Election of Two MLC Seats: తెలంగాణ శాసనమండలిలోని రెండు ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జనవరి 18 వరకు నామినేషన్ల స్వీకరణ.. జనవరి 19న నామినేషన్ల పరిశీలన, 22తో డ్రాకు గడువు. జనవరి 29న పోలింగ్.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. ఉపఎన్నికలు వేరుగా ఉండడంతో ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌కు చేరనున్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎమ్మెల్సీ పదవుల రేసులో చాలా మంది ఉన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రెండు స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది.
Read also: Gunturu Kaaram: ఏంటి అట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనబడుతుందా! మేకింగ్ వీడియో రిలీజ్
సాధారణంగా ఎమ్మెల్సీ పదవీ కాలం ఆరేళ్లు. మధ్యలో ఏదైనా సీటు ఖాళీ అయితే ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఇలా చాలా సార్లు జరిగింది. అయితే ఈసారి రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఒకేసారి ఖాళీగా ఉన్నాయి. శాసన మండలి సభ్యులుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరూ డిసెంబర్ 9న తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వారి పదవీకాలం 30 నవంబర్ 2027 వరకు ఉంది. కానీ వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత వీటికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఈసారి రెండు వేర్వేరు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించనుండటంతో లెక్కలు మారిపోయాయి. ప్రత్యేక బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్‌కు ఆ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది బీఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బే. అందుకే ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. కానీ ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు ఎన్నికలు జరిగితే రెండు వేర్వేరు బ్యాలెట్ పేపర్లు తప్పనిసరి అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
Shraddha Das: బిజినెస్ మ్యాన్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ..