NTV Telugu Site icon

వరంగల్ లో 11 హాస్పిటళ్లకు నోటీసులు…

వరంగల్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ దందాకు సామాన్యులు విలవిలాడుతున్నారు. అయితే కరోనా కష్టకాలంలో ప్రజల దగ్గర నుండి డబ్బులు దండుకుంటూ రోగులు, వారి బంధువులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్‌ హాస్పిటళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వరంగల్ జిల్లాలో మొత్తం. 11 హాస్పిటల్స్ కి నోటీసు జారీ చేశారు. జిల్లా స్థాయిలో 5 హాస్పిటల్స్ కి రాష్ట్ర స్థాయి నుండి 6 హాస్పత్రులను నోటీసులు జారీ చేశారు. ఒక్కరోజుకు 30 వేల నుండి 50 వేలు చార్జీ చేస్తున్నారు. ఇక మెడిసిన్ చార్జీలు అదనంగా ఇవ్వాలి. ఆక్సిజన్ పెడితే మరో 10 వేలు వసూలు చేస్తున్నారు. రేమిడ్ సివర్ ఇంజెక్షన్ హాస్పత్రి వల్లే ఇవ్వాల్సి ఉండగా. బయటకు రాసి బ్లాక్ లో వల్లే అమ్ముతున్నారు. ఐదు రోజులు ఉంటే కనీసం 3 నుండి 5 లక్షలు వసూలు చేస్తున్నారు అని బాధితులు ఆరోపిస్తున్నారు.