Site icon NTV Telugu

గాంధీ ఆస్పత్రిలో మళ్లీ నాన్‌ కోవిడ్ సేవలు

Gandhi Hospital

Gandhi Hospital

కరోనా మహమ్మారి సమయంలో పూర్తిగా కోవిడ్‌ రోగుల సేవలకే పరిమితం అయ్యింది సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి… మొదటి వేవ్‌ తగ్గిన తర్వాత నాన్‌ కోవిడ్‌ సేవలు ప్రారంభించినా.. మళ్లీ సెకండ్‌ వేవ్‌ పంజా విసరడంతో.. కోవిడ్‌ సేవలకే పరిమితం అయ్యింది… అయితే, క్రమంగా ఇప్పుడు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా తగ్గిపోవడంతో.. రేపటి నుంచి మళ్లీ సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు వెల్లడించారు. కోవిడ్ కారణంగా నిలిపివేసిన అన్ని రకాల సాధారణ వైద్య సేవలను మంగళవారం నుంచి పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు వైద్యులు.

Exit mobile version