Site icon NTV Telugu

Akbaruddin Owaisi: “నన్ను ఎవరూ ఆపలేరు”.. పోలీసులను బెదిరించిన అక్బరుద్దీన్ ఓవైసీ.. కేసు నమోదు..

Akbaruddin Owaisi

Akbaruddin Owaisi

Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరో వివాదంలో ఇరుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ర్యాలీలో పోలీసులను బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమయానికి మించి ప్రచారం చేయడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంపై పోలీసులు అభ్యంతరం చెప్పడంతో అక్బరుద్దీన్ ఓవైసీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ని బెదిరించాడు.

‘‘ఇన్‌స్పెక్టర్ సాబ్, నా దగ్గర వాచ్ ఉంది. దయచేసి ఇక్కడి నుండి వెళ్లండి’’ అంటూ పోడియ నుంచి వేదిక వైపు వెళ్లి పోలీస్ అధికారిని వెళ్లమని హెచ్చరిక చేశాడు. తను మాట్లాడకుంటా ఎవరు ఆపలేరని, నేను ఒక్క సిగ్నల్ ఇస్తే, ప్రజలు పోలీసు అధికారిని పరిగెత్తిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘‘కత్తులు, బుల్లెట్లు ఎదుర్కొంటే నేను బలహీనుడిని అయ్యానని అనుకుంటున్నావా..? నాలో చాలా ధైర్యం ఉంది. ఐదు నిమిషాలు మిగిలి ఉన్నాయి. ఐదు నిమిషాలు మాట్లాడుతాను. నన్ను ఎవరూ ఆపలేరు. నేను సిగ్నల్ ఇస్తే మీరు ఇక్కడి నుంచి పారిపోతారు. అలా చేద్దామా..?’’ అని అన్నారు. అక్బరుద్దీన్ చాంద్రాయనగుట్ట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

Read Also: Etela Rajender: రైతులకు రైతుబంధు ఇచ్చి మిగతావి బంధు చేశారు: ఈటెల

ఈ బెదిరింపులపై అక్బరుద్దీన్ ఓవైసీపై ఐపీసీ 06 IPC, 153 IPC, 505(2) మరియు 506 మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 125 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే దీనిపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తన సోదరుడిని ఎందుకు మాట్లాడనీయకుండా చేశారని ప్రశ్నించారు. దీనిపై ఈసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ బీజేపీ స్పందిస్తూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అక్బరుద్దీన్‌పై బుల్డోజర్ యాక్షన్ ఉంటుందని ట్వీట్ చేసింది. దశాబ్ధాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం ఓల్డ్ సిటీని నాశనం చేస్తోందని, నేరాలకు అడ్డాగా మార్చిందని బీజేపీ ఆరోపించింది. తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

Exit mobile version