రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్రంలో పాజిటివిటి రేటు 3.16 శాతంగా ఉందని, ప్రస్తుతం రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని అన్నారు. పాజిటివిటి 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ వంటివి అవసరం అవుతాయని అన్నారు. గత వారం రోజుల వ్యవధిలో ఒక్క జిల్లాలో కూడా పాజిటివిటీ రేటు 10 శాతం దాటలేదని, మెదక్‌లో అత్యధికంగా 6.45 శాతం, కొత్తగూడెంలో 1.14 శాతం పాజిటివిటీ రేటు నమోదైందని అన్నారు. జీహెచ్ ఎంసీలో 4.26, మేడ్చల్ లో 4.22 శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్టు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1శాతంగా ఉందని అన్నారు. ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని, మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
Read: సోషల్ మీడియా వేదికలుగా వ్యాపర దిగ్గజాలకు ఆహ్వానాలు…
