Nizamsagar: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీ ఆనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగింది. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. నిద్రలో వున్న కాలనీ వాసులకు ఒక్కసారిగా ఇండ్లలోకి నీల్లు చేరడంతో.. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. పట్టణ కేంద్రంలో 82 -2 నిజాంసాగర్ ప్రధాన కాలువ ఉదయం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తెగిపోయింది. దీంతో జర్నలిస్ట్ కాలనీ అంతా నీట మునిగింది. దీంతో కాలనీవాసులు అందరూ ఇంటి నుంచి పరుగులు పెట్టారు. అయితే ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ స్థానికుల ఆరోపించారు. సహాయక చర్యలు మొదలుపెట్టాలని కాలనీవాసుల డిమాండ్ చేస్తున్నారు.
Read also: Rapido Cab Services: ‘ఓకే చలో’ యాప్ సేవలు.. క్యాబ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం..!
దీంతో నిజాంసాగర్ ప్రధాన కాల్వలు మురికి కాలువలుగా మారి చెత్తాచెదారంతో నిండిపోయిందని, ఇరిగేషన్ అధికారుల పనితీరుపై స్థానిక కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి ప్రజలకు తాగునీరు అందించి రైతులకు సాగునీరందించారు. కాలువ తెగిపోవడంతో జర్నలిస్టు కాలనీలోకి నీరు చేరి కాలనీవాసులను భయాందోళనకు గురి చేసింది. నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూలడంతో పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
Read also: MLC Kavitha: నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ..
జర్నలిస్ట్ కాలనీలోని ప్రధాన కాలువకు కూతవేటు దూరంలో ఉన్న ఇరిగేషన్ ఎస్‌సి యశస్విని, ఇరిగేషన్ ఇఎ భాను ప్రకాష్, ఇరిగేషన్ డిఇ కృష్ణమూర్తి కార్యాలయాలు శుభ్రం చేయడం లేదని నిజాంసాగర్ ప్రధాన కాలువ ఇరిగేషన్ అధికారులు లేరని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జర్నలిస్టు కాలనీ వాసులు కోరుతున్నారు. ఆర్మూరు ప్రాంతంలోని ఇరిగేషన్ అధికారులు మరి దీనిపై ఎలా స్పందిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. తెల్లవారు జామున 3 గంటలకు కెనాల్ కట్ట తెగిన ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.
Viral: ఇలా తయారయ్యారు ఏంట్రా.. వీడెవడో కానీ.. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కు మధ్య తేడా ఇదంట..!