Site icon NTV Telugu

Vemula Prashanth Reddy: ఖమ్మం సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్ అయ్యింది

Vemula Prashanth Reddy Bandi Sanjay

Vemula Prashanth Reddy Bandi Sanjay

Vemula Prashanth Reddy: బండి సంజయ్‌ కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజమాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఖమ్మం సభను చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు బండిని ఎప్పుడో మరచిపోయారని ఎద్దేవ చేశారు. ఖమ్మం సభను వచ్చిన జనం చూసి యావత్ దేశం ఆశ్చర్యపోయిందని అన్నారు. కంటి చూపు చూసేంత జనం వచ్చారని అన్నారు. బహిరంగ సభలు బీజేపీకి తెలియదన్న ఆయన బీజేపీ పార్టీ, ప్రధాని మోడీ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి? ఏం చేయబోతున్నారో చెప్పాలి? అని ప్రశ్నించారు. కేటీఆర్, కేసీఆర్ ను తిట్టడం పనిగా పెట్టుకుంటే ప్రజలు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుకు గల్లీలో పెట్టె ప్రజా సంగ్రామ సభలో ఎంత మంది ఉంటున్నారు? అని కౌంటర్‌ ఇచ్చారు. భవిష్యత్ లో దేశంలో ఎక్కడ ఏ సభ జరిగిన ఇట్లాగే ఉంటుందని చురకలంటించారు. ఖమ్మం సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్ అయ్యిందని వ్యాఖ్యానించారు.

Read also: Tension at Nampally: నాంపల్లిలో ఉద్రిక్తత.. కలెక్టర్ కార్యాలయం ముట్టడి

నిన్న ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా.. బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే… సభకు వచ్చిన జనాలు, నేతలు మనస్పూర్తిగా పాల్గొనలేదని ఎద్దేవ చేశారు. బెదిరించి సభను సక్సెస్ చెయ్యాలని చూసారని ఆరోపించారు. కర్నాటక మాజీ సీఎం, బీహార్ సీఎం నితీశ్ కూడా రాలేదని అన్నారు బండి సంజయ్‌. కేసీఆర్ దగ్గర ఉన్న లిక్కర్ డబ్బులు పంచుకోవడానికి జాతీయ నేతలు వచ్చినట్లున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నోట ఏ దేశం మాట వచ్చినా ఆ దేశం సర్వనాశనం అవుతుందని అన్నారు. పాకిస్థాన్ గురించి మాట్లాడితే అక్కడ తిండి గురించి కొట్లాడుకుంటున్నారని అన్నారు. దయచేసి భారత దేశం బాగుందని కేసీఆర్ నోటి వెంట ఆ మాట రావద్దని కోరుకుంటున్నానని మీడియా ముఖంగా కేసీఆర్‌ పై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో 21 డ్యాంల నిర్మాణాలను 8 సంవత్సరాల నుండి పెండింగులో పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదని ఎద్దేవ చేశారు. పొలం దగ్గర ఫ్రీ కరెంట్ అని, ఇంటి దగ్గర కరెంట్ కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ పై ఫైర్ అవుతున్నారు. మీడియా సమావేశం నిర్వహించి కౌంటర్ ఇచ్చారు.
Puvvada Ajay Kumar: కాంగ్రెస్ ను ఓడించడానికి సుపారీ అవసరం లేదు.. వాళ్ళ నేతలే చాలు

Exit mobile version