Site icon NTV Telugu

Amit Shah: రేపు తెలంగాణకు అమిత్ షా.. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం

Amitshah

Amitshah

Amit Shah: రేపు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. రేపు ఉదయం 11.25 గంటలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానశ్రయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి వినాయక్ నగర్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్నీ ప్రారంభించడానికి వెళ్లనున్నారు.

Read Also: ZEE5 vs Etv Win : వాళ్లే తొందరపడ్డారు.. అంతా కోర్టు చూసుకుంటుంది!

ఇక, మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. 2 నుంచి 2.30 వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం 2.35 గంటలకు నిజామాబాద్ లోని కంటేశ్వర్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 2. 45 నుంచి 4 గంటల వరకు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

Exit mobile version