Site icon NTV Telugu

Student Missing: లండన్ లో నిజామాబాద్ విద్యార్థి మిస్సింగ్..

Missing

Missing

Student Missing: లండన్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతుంది. ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన అనురాగ్ రెడ్డి లండన్ లో ఈ నెల 25వ తేదీన అదృశ్యం అయ్యాడు. కార్దీప్ ప్రాంతానికి స్నేహితులతో కలిసి వెళ్ళి అదృశ్యమైయ్యాడు. ఈ విషయాన్ని వెంటనే తల్లికి స్నేహితులు తెలిపారు. దీంతో తన కుమారుడిని వెతికించి, స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వానికి బాధితులు విజ్ఞప్తి చేశారు. కాగా, ఏడాదిన్నర క్రితం ఉన్నత చదువుల కోసం అనురాగ్ రెడ్డి లండన్ వెళ్లాడు.

Read Also: Vijay Devarakonda : కింగ్‌డ‌మ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ డేట్ ఫిక్స్

అయితే, తన కొడుకు లండన్ లో తప్పిపోయాడు.. అతడ్ని వెతికి ఇండియాకు తీసుకురావాలని కోరుతూ అనురాగ్ రెడ్డి తల్లి హరిత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి సోమవారం వినతిపత్రం పంపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్ లోని ఇండియన్ హై కమీషన్ కు లేఖలు రాశారు.

Exit mobile version