NTV Telugu Site icon

Nizamabad: డబ్బుల కోసం ముగ్గురు పిల్లలను అమ్మేసిన అమ్మ..

Nizamabad Crime

Nizamabad Crime

Nizamabad: డబ్బుల కోసం ఓ తల్లి కన్న బిడ్డలనే అమ్ముకున్న ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూరులోని మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్మికి ముగ్గురు పిల్లలు వున్నారు. ఈ ముగ్గురు పిల్లలు మొదటి భర్తకు పుట్టిన వారే. అందులో ఏడేళ్ల కుమారుడు, ఇద్దరు ఐదేళ్ల కవలలు ఉన్నారు. ఇంతలో భాగ్యలక్ష్మి భర్త చనిపోయాడా? వదిలేశాడా? లేక భాగ్యలక్ష్మి మరో పెళ్లి చేసుకుందో ఏమో తెలియదు కానీ.. భాగ్యలక్ష్మి తన ముగ్గురు పిల్లలను 10 నెలల క్రితం డబ్బు కోసం ఇతరులకు విక్రయించింది.

Read also: Pushpa 2 : పుష్ప 2 సక్సెస్ సంబరాల్లో అల్లు అర్జున్.. ఈ సారి గ్యాప్ తప్పని సరి అయ్యేలా ఉందే

వారిని నిజామాబాద్ జిల్లా సూర్భిర్యాలకు చెందిన గంగాధర్ అనే వ్యక్తికి ఆమె విక్రయించినట్లు సమాచారం. 1లక్ష, భీమ్ గల్ మండలానికి చెందిన నర్సయ్యకు రూ. 1.2 లక్షలు, జగిత్యాల జిల్లాకు చెందిన వనజకు రూ. 2 లక్షలకు విక్రయించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. భాగ్యలక్ష్మిని విచారించగా పిల్లలను అమ్మినట్లు విచారణలో తేలింది. పిల్లలను విక్రయించిన ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Jammu Kashmir: ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం.. బాడీలపై బుల్లెట్ గాయాలు

Show comments