NTV Telugu Site icon

Nizamabad Crime: ఎంత పని చేశావు పిన్ని.. ఇద్దరు ఆత్మహత్యకు కారణమయ్యావు..

Nizamabad Crime

Nizamabad Crime

Nizamabad Crime: నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్,శైలజ (యువ జంట) ఆత్మహత్య కేసులో మృతురాలి పిన్నిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. తన బంధువులు సూటి పోటి మాటలతో చిత్రహింసలకు గురిచేశారని మనస్తాపంతో యువ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. యువ జంటను మాటలతో ఎవరు చిత్రహింసలకు గురిచేశారంటూ విచారణ చేపట్టారు. చివరకు వారి బంధువైన పిన్ని నే యువ జంట ఆత్మహత్యకు కారణమని తెలుసుకున్నారు. ఆత్మహత్య కు ముందు శైలజ సెల్ఫీ విడియో ఆధారంగా శైలజ పిన్ని లక్ష్మి అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తనకు ఏమీ తెలియదని నేను వారికోసమే మంచి చెప్పానంటూ ముత్యాల మాటలు చెప్పింది లక్ష్మి పిన్ని. తన మాటల్లో నిజాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లక్ష్మిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Secret Room : నేడు తిరిగి తెరుచుకోనున్న పూరిలోని జగన్నాథస్వామి ఆలయం రహస్య గది

పిన్న మాటలకు ఆత్మాభిమానం దెబ్బతినడంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అనంతరం ఆ వీడియోలను కోటగిరి ఎస్సై సందీప్‌కు పంపించిన విషయం తెలిసిందే. అయితే యువజంటను కాపాడేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నించిన ఫలితం దగ్గలేదు చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. బంధువులే వారి చావుకు కారణమని గ్రహించిన పోలీసులు కేసుపై ఫోకస్ పెట్టారు. చివరకు మృతురాలి పిన్నిని అదుపులో తీసుకున్నారు. అయితే వారు ఒక తప్పు చేశామని దానికి భర్త క్షమించాడు అంటూ లావణ్య చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ తప్పు ఏమిటి? భర్త క్షమించిన బంధువులు మాటలు చెప్పడం ఏంటని ఆరా తీస్తున్నారు. యువ జంట చేసిన తప్పు మీదే మృతురాలి పిన్న లక్ష్మి దుర్భాసలాడిందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువజంట ఆత్మహత్యకు కారణకులైన పిన్నిని పోలీస్టేషన్‌ కు తరలించారు. కుటుంబ సభ్యుల్లోనే విరోధులు ఉండటం అంటే ఇదేనేమో అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
AP-Telangana: రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..