Site icon NTV Telugu

Nizamabad: పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..!

Nzb

Nzb

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందటం పట్ల మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతుడు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆలకుంట సంపత్.. జగిత్యాల జిల్లాలో శ్రీ రామ ఇంటర్ నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు.. గల్ఫ్ లో ఉద్యోగాల పేరిట సంపత్ తమను మోసం చేశారని సైబర్ పోలీసులకు నిజామాబాద్ బాధితుల ఫిర్యాదు చేశారు.

Read Also: Srisailam: శ్రీశైలంలో సంప్రదాయబద్ధంగా గిరిప్రదక్షిణ, లక్ష కుంకుమార్చన

అయితే, ఈ నెల 4వ తేదీన ఆలకుంట సంపత్ తో పాటు మరో యువకున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ తరలించారు. విచారణ పేరిట ఈ నెల12వ తేదీన కస్టడీలోకి తీసుకుని విచారణ చేయగా.. రాత్రి సంపత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. విచారణ పేరిట సంపత్ ను పోలీసులే కొట్టి చంపారని మృతిని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రి ఎదుట రాస్తా రోకో నిర్వహించారు.

Exit mobile version