Municipal Elections : ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీకి కాసుల వర్షం..!
- నో డ్యూ సర్టిఫికెట్తో బకాయిల వసూలు వేగం
- రెండు రోజుల్లో రూ.25 లక్షల పన్నుల క్లియరెన్స్
- ప్రతిపాదకుల బకాయిలే అభ్యర్థులకు కొత్త చిక్కులు
- నామినేషన్ గడువు పెంచాలంటూ డిమాండ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ నామినేషన్ పత్రాలతో పాటు తప్పనిసరిగా మున్సిపాలిటీకి ఎలాంటి బకాయిలు లేవని తెలిపే ‘నో డ్యూ సర్టిఫికెట్’ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మున్సిపాలిటీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను, కుళాయి పన్ను బకాయిలు ఇప్పుడు వసూలవుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అభ్యర్థులు సుమారు 25 లక్షల రూపాయల మేర పాత బకాయిలను చెల్లించడం విశేషం. పన్నులు కడితేనే సర్టిఫికెట్ ఇస్తామని అధికారులు స్పష్టం చేయడంతో, అభ్యర్థులు పోటీపడి మరీ బకాయిలు క్లియర్ చేస్తున్నారు.
Techie Jobs At Risk: హై రిస్క్‌లో ఐటీ ఉద్యోగాలు.. హెచ్చరించిన ఎకనామిక్ సర్వే..
Also Read
ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులకు ఈసారి నిబంధనలు ప్రాణసంకటంగా మారాయి. పోటీ చేసే అభ్యర్థితో పాటు, వారిని ప్రతిపాదించే వ్యక్తులు కూడా ఎలాంటి పన్ను బకాయిలు ఉండకూడదనే నిబంధనపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదించే వ్యక్తికి పన్ను బకాయిలు ఉంటే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో, అభ్యర్థులు వారి పన్నులు కూడా తామే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ఇది ఎన్నికల గైడ్‌లైన్స్‌లో లేకపోయినా, రిటర్నింగ్ అధికారులు సొంత నిర్ణయాలతో తమను ఇబ్బంది పెడుతున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
నామినేషన్ల ప్రక్రియ ముగియడానికి సమయం చాలా తక్కువగా ఉండటం, మరోవైపు సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేదా పని ఒత్తిడి వల్ల గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, దీనివల్ల నామినేషన్ వేయడం కష్టమవుతుందని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల గడువును మరో రెండు రోజులు పెంచాలని చాలా మంది అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నారు. నిజామాబాద్‌లోని 60 డివిజన్లలో సుమారు 400 మంది వరకు అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉండటంతో, ఈ గందరగోళం మరింత పెరిగేలా కనిపిస్తోంది.
Golden Duck: టీ20 మ్యాచ్‌లో ఫస్ట్ బాల్ కే ఔటైన 5 మంది భారత బ్యాట్స్‌మెన్స్ వీరే..!
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!