NTV Telugu Site icon

MP Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు

Nizamabad Mp Arvind Kumar

Nizamabad Mp Arvind Kumar

MP Arvind: తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఎన్నికలకు సంబంధించి బీజేపీ సీనియర్ నేతలు ఇప్పటికే ముఖ్య నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకం చేసేందుకు బీజేపీ నాయకత్వం కూడా సిద్ధమైంది. ఇందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఎంపీకి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఎంపీ అరవింద్. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎంపీ అరవింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది.

Read also: PSLV-C56: మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఒకేసారి ఏడు ఉపగ్రహాలు నింగిలోకి..

ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కేసీఆర్ బ్రతికున్నంత కాలం మీకు ఇల్లు రావని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం స్కాములు తప్ప ఏమి చేయదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కు వచ్చిన 10 వేల కోట్లను కవితకు ఇచ్చాడని ఆరోపించారు. అవి తీసుకెళ్లి ఢిల్లీ లిక్కర్ లో పెట్టిందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పెట్టుకున్న సంబంధాలతో సిసోడియా జైలుకు వెళ్ళాడని అన్నారు. ఏపీలో తెలంగాణ కంటే అద్భుతమైన ఇళ్లు కట్టారని అన్నారు. ఏపీలో 8 లక్షల ఇళ్లను నిర్మించారని తెలిపారు. ప్రపంచంలో కవిత అతి పెద్ద అవినీతి పరురాలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా ముక్కు నేలకు రాయాలటమా.. నా చెప్పు కూడా రాయను అని అన్నారు. ఈమె పెద్ద ఐరన్ లెగ్.. మీ నాన్న ముక్కు నెలకు రాపిస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీమ్ గల్ లో బస్ డిపో కట్టడానికే డబ్బులు లేవు అని మంత్రి ఆర్టీసీ చైర్మన్ చెపుతున్నారని గుర్తు చేశారు. బస్ డిపో కట్టని వాళ్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నారని వ్యంగాస్త్రం వేశారు. గంజాయి విషయంలో తన కుటుంబ సభ్యులు, పాలోవర్స్ చేస్తున్నారు అని తనే ఒప్పుకున్నాడని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే అభివృద్ధి చేస్తున్నారని మొన్న బయటపెట్టాక ఒప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో తిరగడానికి ఒక్కో అధ్యక్షునికి 10 లక్షలు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కవిత నాపై పోటీ చేయను అంటుంది, సో నీ దారి నువ్వు చుస్కో.. నా దారి నేను చూసుకుంటా అని అరవింద్ అన్న మాటలు ఇప్పుడు దుమారాన్ని రేకెత్తించాయి. ఎమ్మల్సీ కవిత చేసిన సవాల్ కు అరవింద్ ఇచ్చిన సమాధానంపై కవిత ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠత నెలకొంది.
Milk Gang Arrest: మేడ్చల్‌ అడ్డాగా కల్తీ పాల దందా.. ముఠా గుట్టు రట్టు..