నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Arvind Dharmapuri) ఎప్పుడూ టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతుంటారు. కేసీఆర్ సంగతి ఎత్తితే ఆయన విమర్శలు మరింత పదునెక్కుతుంటాయి. కానీ ఆయన చాలా మారిపోయినట్టుంది. తాజాగా ఆయన చేసిన వీడియో, ట్వీట్ వైరల్ అవుతోంది. తెలంగాణాలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ చేసిన విదేశీ కుట్ర వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయింది. ఈ వ్యాఖ్యల అనంతరం తనకు చాలా బాధనిపించింది, జాలి కూడా కలిగింది. ఆయన మమ్మల్ని ఏ విధంగా బాధించినా, ఇకనుండి వారిపై పరుష పదజాలం ఉపయోగించకుండా ఉండడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను. ఆయన బాధలో వున్నారు. ఆయన మానసిక ఆరోగ్యంపై దిగులుగా వుందని ట్వీట్ చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్.
ప్రముఖ క్రీడాకారులు-ఆటో బయోగ్రఫీలు
కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు పెరిగింది. ఇది తేటతెల్లం అయింది. పిల్లలందరినీ రాజకీయాల్లోకి తెచ్చుకున్నారు. ఆయనకు ఫ్రెషర్ పెరిగింది. రాజకీయంగా టీఆర్ఎస్ దిగజారుతోంది. ఆ వివరాల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఆయన మానసిక ఆరోగ్యం బాగాలేదు. నేనేం వెటకారంగా అలా అనడం లేదు. ఆయనపై పరుష పదజాలం వుపయోగించను. సాంకేతికంగా మాత్రమే నేను మాట్లాడతాను. నేను మనస్ఫూర్తిగా చేసుకున్నాను. ఆయన బాధలో వున్నారు. ఆయన మానసిక ఆరోగ్యంపై దిగులుగా వుంది. నేనేం వెటకారంగా అనడంలేదు. ఆయన పెద్ద మనిషి, ఆయన్ని బాధించకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తానంటూ ట్వీట్ చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.
ఇటీవల ఎంపీ అరవింద్ వాహనంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్డండి గ్రామంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై రాళ్ల దాడి జరిగింది. తాము ఇప్పుడు గుర్తొచ్చామా..? అంటూ ఆయనను గ్రామస్తులు నిలదీశారు. ఎంపీ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయం కోసం ఎంపీ తమ గ్రామానికి వచ్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామస్తులు ఎంపీ కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ పై దాడి చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలని బీజీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో అర్వింద్ ట్వీట్ వైరల్ అవుతోంది.