Nitin Nabin : తెలంగాణకు నితిన్ నబీన్.. రెండు పాదయాత్రల ప్లాన్

  • 23న తెలంగాణకు నితిన్ నబీన్
  • కరీంనగర్‌లో మహా పాదయాత్ర
  • ఏర్పాట్లలో బీజేపీ శ్రేణులు
  • నిజామాబాద్ పర్యటనపై అరవింద్ పట్టు
Nitin Nabin

Nitin Nabin

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 23న రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు. 23వ తేదీ మధ్యాహ్నం కరీంనగర్‌లో ఈ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఉత్తర తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కరీంనగర్‌లో మహా పాదయాత్రకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.

23న మధ్యాహ్నం జరిగే ఈ కార్యక్రమంలో నితిన్ నబీన్ పాల్గొనడం ద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలని నేతలు భావిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్‌కు కూడా సమయం కేటాయించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పట్టుబడుతున్నారు. అదే రోజు నిజామాబాద్‌లో కూడా పాదయాత్ర నిర్వహించుకుంటానని అరవింద్ స్పష్టం చేస్తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.