Site icon NTV Telugu

Nirmala Sitharaman: జీఎస్టీ అధికారుల కిడ్నాప్ పై నిర్మలా సీతారామన్ సీరియస్

Nirmala Sitharaman

Nirmala Sitharaman

హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. సరూర్‌ నగర్‌ పరిధిలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్‌ కలకలం రేపింది. ఈ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించిన ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల కిడ్నాప్‌ ఘటనపై తెలంగాణ పోలీసులను ఆరా తీశారు. అధికారుల కిడ్నాప్‌ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్‌ ను ఫోన్‌లో కోరింది.

Read Also: Rana – Teja film: 2 భాగాలుగా రానా, తేజ సినిమా?

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. జీఎస్టీ కట్టని షాప్‌ను సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి ఆఫీసర్‌ మణిశర్మ, మరో అధికారి ఆనంద్‌లను.. దుకాణదారు, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేశాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు కిడ్నాపర్లను వెంటాడి అధికారులను రక్షించారు. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితులు ఫిరోజ్, ముజీఫ్, ముషీర్, ఇంతియాజ్‌లను అరెస్ట్ చేసి వీరిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Read Also: Kamal Haasan: ‘’ప్రాజెక్ట్ కే’’లో కమల్ రోల్ లీక్?

ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకృష్ణా నగర్‌లో ఫేక్ జీఎస్టీ నంబర్‌తో జీఎస్టీ కట్టని ఒక స్క్రాప్ గోదాంను సీజ్ చేసేందుకు వెళ్లిన.. GST ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్‌ మణి శర్మతో పాటు ఆనంద్ వెళ్లారు. ఆ టైంలో షాప్ నిర్వాహకుడు సహా మరో ముగ్గురు కలిసి… ఓ కార్ లో కిడ్నాప్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. GST అధికారుల ఐడీ కార్డులు చింపి.. వారిపై దాడి చేసినట్లు డీసీపీ సాయి శ్రీ తెలిపారు. మాకు విషయం తెలియగానే దిల్‌సుఖ్‌ నగర్ రాజీవ్ చౌక్ వద్ద కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఒక నిందితుడు ఖాయూం పరారీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అని డీసీపీ సాయి శ్రీ పేర్కొన్నారు.

Exit mobile version