Site icon NTV Telugu

Nirmala Sitharaman: ఒక ప్రశ్న అడిగితే నన్ను ప్రశ్నిస్తావా? ముందు నీ రాష్ట్రం చూడు! హరీష్ రావుకు నిర్మల కౌంటర్..

Harsih Rao, Nirmala Sitaraman

Harsih Rao, Nirmala Sitaraman

Nirmala counter to Minister Harish Rao: ముందు నీ రాష్ట్రం చూడు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో.. ఒక ప్రశ్న అడిగితే నన్ను ప్రశ్నిస్తావా? అని చెప్పే వాడికి చెబుతున్నా అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్స్ చేసేసారు. 2014 నుంచి రైతుల ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టామని, ఏ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధాని మోదికి తెలుసని అన్నారు. ఒక బలమైన వాతావరణం ఏర్పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. రైతుల విషయంలో ఎవరైనా రాజకీయాలు చేయడానికి వీలు లేదని, రైతు గురించి అనుమానాస్పదంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు రైతులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా, కేంద్ర ప్రబుత్వం ఇచ్చినా రైతులకే కదా? అంటూ ప్రశ్నించారు.

ఎవరు తక్కువ ఇచ్చారు.. ఎవరు ఎక్కువ ఇచ్చారు అన్నది ముఖ్యం కాదు! తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు జొన్న పంట వేయొద్దని బెదిరిస్తుందని నిర్మలాసీతారమన్‌ ఆరోపించారు. వారి పంట కూడా కేంద్రం కొనుగోలు చేయట్లేదని ప్రచారం చేస్తోందని, కేంద్రాన్ని బదనాం చేస్తుందని మండిపడ్డారు. వరి వేస్తే ఉరే అన్నారు.. బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు, ఇది నేను చెప్పేది కాదు రైతులే చెబుతున్నారని నిర్మాల అన్నారు. ప్రాజెక్టుల కోసం రైతులు భూములు ఇస్తున్నారు, మరి వారికి సరైన నష్ట పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. మానేరు, పాలమూరు, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు మొత్తం నష్ట పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు 2017 నుంచి 2019 వరకు 2237 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నిర్మాల అన్నారు. పక్క రాష్ట్రాలు చూడు అని ఇక్కడి మంత్రి ( మంత్రి హరీష్ రావు) అంటున్నారు.. ముందు నీ రాష్ట్రం చూడు! ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. రైతులపై ప్రేమ ఉంటే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. రైతులకు సహకారం అందిస్తామని ఇక్కడి ప్రభుత్వం చెబుతుంద, మరి Trs ప్రభుత్వం 2014 నుంచి తెలంగాణలో 17000 కోట్లు రుణ మాఫీ చేస్తామని చెప్పింది, కానీ 100 మంది రుణాలు తీసుకుంటే 5 గురికి మాత్రమే చేశారని విమర్శల వర్షం కురిపించారు నిర్మాలా. ఇది ఎస్‌బీఐ చెప్పింది..నేను కాదు అంటూ ఎద్దేవ చేశారు. ఒక ప్రశ్న అడిగితే…నన్ను ప్రశ్నిస్తావా? అని చెప్పే వాడికి చెబుతున్నా అంటూ మండిపడ్డారు.

అన్ని రాష్టాల్లో ఎంత మాఫీ అయింది, డీటెయిల్స్ చెప్పిన మంత్రి, మహారాష్ట్ర లో 100 లో 68 మందికి రుణమాఫీ చేశాం, యూపీలో 100 మందికి 52 మందికి రుణమాఫీ, కర్ణాటక లో 100 కి 38, పంజాబ్ 100 మందికి 24 మందికి రుణం, మద్యప్రదేశ్ 100 కి 12 మంది, తెలంగాణలో మాత్రం 100 మంది 5 గురికే రుణమాఫీ, తెలంగాణకి పీఎం కిసాన్ సమ్మన్ నిధి 2014 నుంచి ఇప్పటివరకు 7658 కోట్లు ఇచ్చాము, 37.95 లక్షల రైతులకు లబ్ది చేకూరిందని, కృషి వికాస్ యోజస్ 8590 కోట్లు ఇచ్చామని, NFNS స్కిం కింద 51 కోట్లు ఇచ్చాము. 1366 కోట్లు ఇచ్చాము నూనె విత్తనాల తయారీకి మొత్తం రైతుల కోసం తెలంగాణకి 10729 కోట్లు ఇచ్చామని తెలిపిన మంత్రి ఇంకా కేంద్రం ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు. మోడీ రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తాం అన్నవారికి చెబుతున్న,
మోడీ రైతుల మీద పెట్టె దృష్టి.. మీరు పెట్టట్లేదని తీవ్ర విమర్శలు చేశారు.
Minister Jogi Ramesh: కుప్పంలోనే దిక్కు లేదు.. పులివెందులను టచ్ చేసే ధైర్యం ఉందా?

Exit mobile version