Site icon NTV Telugu

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మెస్లకు ఆన్లైన్ టెండర్లు

Basara

Basara

Basara IIIT: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో నాలుగు మెస్ లకు ఆన్ లైన్ టెండర్లు పిలిచింది. మార్చి 20వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే, వచ్చిన ప్రైస్ బిడ్ లను తెరిచి టెక్నికల్ ప్రాసెస్ పూర్తి చేసింది కమిటీ. ఇంకా ఫైనాన్స్ అర్హతలను చూసి అర్హులైన వారికి కమిటి ఆమోదంతో పాటు ప్రభుత్వ అనుమతితో మెస్ టెండర్లను అధికారులు ఖరారు చేయనున్నారు. కాగా, ట్రిపుల్ ఐటీలో నాలుగు మెస్ లకు గాను 38 బిడ్లు వచ్చాయి. టెండర్ నియమ నిబంధనల ప్రకారం ఎవరు అర్హత సాధిస్తే వారికి టెండర్లు దక్కే అవకాశం ఉంది.

Read Also: Tollywood : మరొక మలయాళం సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్

అయితే, మెస్ టెండర్ల ఎంపిక ప్రక్రియపై ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్ స్పందించారు. ఇంకా టెండర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది అని తెలిపారు. ఇప్పటి వరకు ఎవ్వరికి ఇంకా టెండర్లు అనేది నిర్ధారించలేదు అని తేల్చి చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యాక మరిన్నీ వివరాలు వెల్లడిస్తాం అన్నారు.

Exit mobile version