Site icon NTV Telugu

One Vote Victory: అమెరికా నుంచి వచ్చి ఓటేసిన మామ.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన కోడలు

Us Mama

Us Mama

One Vote Victory: అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన మామ కారణంగా కోడలు ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన సంఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ముత్యాల శ్రీవేద ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందగా, ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలుసుకున్న ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి నాలుగు రోజుల ముందు గ్రామానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read Also: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 426 ఓట్లు ఉండగా, వాటిలో 378 ఓట్లు పోలయ్యాయి. ఇందులో శ్రీవేదకు 189 ఓట్లు రాగా, ప్రత్యర్థి హర్ష స్వాతికి 188 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక, ఒక ఓటు చెల్లనిదిగా మారడంతో చివరకి శ్రీవేద ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా గెలిచినట్లు ఎంపీడీవో ప్రకటించారు. దీంతో కోడలు ముత్యాల శ్రీవేద తన మామ ముత్యాల ఇంద్రకిరణ్ రెడ్డి వద్ద ఆశీర్వాదాలు తీసుకుంది.

Exit mobile version