NTV Telugu Site icon

Niranjan Reddy: వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలి

Singireddy Niranjan Reddy

Singireddy Niranjan Reddy

Niranjan Reddy Review Meeting On Telangana Agriculture: వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం ఆశాజనకంగా ఉందని, ఆలస్యమైనా వర్షాలు సాగుకు సహకరిస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, వరి నాట్లు జోరందుకున్నాయని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంత సాగునీటి లభ్యతపై ఇప్పటికే ఒకసారి సీఎం ఉన్నతస్థాయిలో రెండు సార్లు శాఖ తరపున సమీక్ష చేశామని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా స్వల్పకాలిక పంటల సాగుపై చైతన్యం చేయాలన్నారు.

Eesha Rebba : నాకు ఇద్దరు పిల్లలు వున్నారు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఈషా రెబ్బా..

శాస్త్రవేత్తల సూచన ప్రకారం.. కంది, పత్తి పంటలను మరో వారం రోజుల వరకు విత్తుకోవచ్చని, మొక్కజొన్న పంట సాగుకు ఈ వర్షాలు ఈ నెలాఖరు వరకు అనుకూలంగా ఉంటాయని మంత్రి నిరంజన్ తెలిపారు. ఇదివరకే వరి నారు అందుబాటులో ఉన్న రైతులు.. ఈ అదును నేపథ్యంలో వెంటనే నాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. నేరుగా విత్తుకునే స్వల్పకాలిక వరి రకాలపై దృష్టి సారించాలన్నారు. దీనిమూలంగా పంట ఖర్చులు, సాగు కాలం కలిసొస్తుందని చెప్పారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నిన్నటి వరకు కురిసిన వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకుందని.. వాతావరణ శాఖ సూచనల ప్రకారం మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో 32 జిల్లా్ల్లో ఆయిల్ పామ్ సాగుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయ్నారు. ఈ ఏడాదిలో కొత్తగా వచ్చిన ఐదు జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ముందుకెళ్లాలని తెలియజేశారు.

Man Killed Using Cobra: ప్రియురాలి స్కెచ్‌.. ఇంటికి పిలిచి.. పాముతో కాటు వేయించి..!

గతేడాది అధిక వర్షాల కారణంగా ఆయిల్ పామ్ సాగుకు ఆటంకాలు ఎదురయ్యాయని.. ఈ ఏడాది అన్నీ సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని మంత్రి నిరంజన్ పేర్కొన్నారు. ఇప్పటికే 11 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం పూర్తయ్యిందన్నారు. 75 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటుకోవడానికి ఆన్‌లైన్ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. దీనికి సంబంధించి రైతులకు అందాల్సిన రాయితీలన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. అధికారులు ఆయిల్ పామ్ సాగుకు రైతులను మరింత ప్రోత్సహించాలని సూచించారు. నూతనంగా ఆయిల్ పామ్ సాగుకు ఎంపిక చేసిన జిల్లాల్లో వెంటనే ఇతర జిల్లాల నర్సరీల నుండి మొక్కలు ఇచ్చి నాట్లు వేయించాలన్నారు.