NTV Telugu Site icon

Niranjan Reddy: ధాన్యం ఎలావున్నా కొనాల్సిందే.. జిల్లా కలెక్టర్లకు నిరంజన్ రెడ్డి ఆదేశాలు

Singireddy Niranjan Reddy

Singireddy Niranjan Reddy

Niranjan Reddy: ఎలాంటి దాన్యం అయిన, ప్రతీ ధాన్యపు గింజ కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని జిల్లా కలెక్టర్లకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అరవై ఏళ్ల పాలనలో ఎన్ని ప్రభుత్వ గోడౌన్స్ నిర్మించారో.. కేవలం తొమ్మిదేళ్లలో అంతకు మించి గోడౌన్ల నిర్మాణం జరిగిందని అన్నారు. కేంద్రం ప్రభుత్వం చేతులెత్తేసింది. FCI తరపున ఒక్క గోడౌన్ కూడా కట్టలేదన్నారు. రైతు బంధు పథకం వల్లే తెలంగాణలోని ప్రతి బీడు భూమిలో పంటలు పండుతున్నాయన్నారు. భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయని అన్నారు.

Read also: Errabelli: కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎం మాట్లాడుతారో వాళ్ళకే తెలియదు

దేశంలో అత్యధికంగా ఎకరాకు 20 లక్షల మించి ధరలు పలుకుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఐక్యరాజ్య సమితి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు, రైతు బీమాను బెస్ట్ స్కీమ్స్ అని అభినందించిందని తెలిపారు. కానీ దేశ ప్రధానికి, బీజేపీ నేతలకు మాత్రం కనిపించడం లేదన్నారు. తెలంగాణలో జరిగిన పంట నష్టంపై కేంద్రానికి ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి చూస్తే దుఃఖం వచ్చిందని, కానీ కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. ఎలాంటి దాన్యం అయిన కొనాల్సిందే అని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రతీ ధాన్యపు గింజ కొనాల్సిందే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.
Chandrika Ravi: అందాలు దాగనంటున్నాయా.. బట్టలు కూడా నిలవడం లేదా పాప

Show comments