Site icon NTV Telugu

Niranjan Reddy: కల్లాలు కట్టడం నేరమా..? తెలంగాణపై కేంద్రం కక్ష కట్టింది.

Niranjan Reddy

Niranjan Reddy

Niranjan Reddy criticizes BJP and Kishan Reddy: ఉపాధి హామీ పనుల కింద కల్లాల నిర్మాణాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని.. కానీ ఈ పనులు చేయడానికి వీలు లేదని కేంద్రం తెలంగాణకు నోటీసులు ఇచ్చింది.. రైతుల కోసం కల్లాలు కట్టడం నేరామా..? అని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఉపాధి హమీ పనుల్లో వ్యవసాయ ఉత్పత్తి పెంచే పనులు చేసుకోవచ్చని చట్టం చెబుతోందని ఆయన అన్నారు. అయినా కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Read Also: Harish Rao: వైద్యసేవల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంటే.. యూపీ చివరి స్థానంలో ఉంది.

వ్యవసాయాన్ని, ఉపాధి హామీతో అనుసంధానం చేయాలని మొదటి నుంచి బీఆర్ఎస్ కోరుతోందని.. 2008లోనే పార్లమెంట్ లో బీఆర్ఎస్ వ్యవసాయం, ఉపాధి హామీని అనుసంధానం చేయాలని కోరాము. 2014, 2019 బీజేపీ మ్యానిఫెస్టోలో వ్యవసాయాన్ని ఉపాధి హామీలో అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పటికీ ఈ హామీని అమలు చేయడం లేదని విమర్శించారు.

ఫామ్ ఆయిల్ పంట ప్రోత్సహకం కింద కేంద్ర ఒక్క అణా కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆయన అన్నారు. తెలంగాణలో 46 వేల ఎకరాల్లో ఫామ్ ఆయిల్ సాగవుతోందని తెలిపారు. ఫామ్ ఆయిల్ ప్రోత్సాహకం కింద కేంద్రం ఎంత ఇచ్చిందో చెప్పాలని.. బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి అలా ఎలా మాట్లాడుతారని కిషన్ రెడ్డిపై, నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Exit mobile version