NTV Telugu Site icon

Harish Rao: లోక్‌సభలో తెలంగాణ బిల్లు పాసై నేటికి 9 ఏళ్లు మంత్రి ట్విట్‌ వైరల్‌

Harsih Rao, Kcr

Harsih Rao, Kcr

Harish Rao: తెలంగాణ ఏర్పాటులో ఫిబ్రవరి 18 అత్యంత ముఖ్యమైన రోజుగా గుర్తింపు ఉంది. ఆ రోజే తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. అది 2014 ఫిబ్రవరి 18.. తెలంగాణ కొత్త చరిత్రకు నాంది పలికిన రోజు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభ ఆమోదించిన శుభదినమైన ఫిబ్రవరి 20న రాజ్యసభ కూడా బిల్లును ఆమోదించింది. అక్కడి నుంచి మార్చి 1, 2014 వరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసే వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. ఆరున్నర దశాబ్దాల ఆకాంక్షలకు రూపు ఇస్తూ 2014 మార్చి 1న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు రాజముద్ర పడింది.

రాష్ట్రపతి ఆమోదం తర్వాత జూన్ 2వ తేదీని రాష్ట్ర అపాయింటెడ్ డేగా ప్రకటించడం అపూర్వమైన తరుణం. ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 2014 జూన్ 2న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణ బంగారు యాత్ర ప్రారంభమైంది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆనాటి ఫొటోను సోషల్ మీడియాలో జతచేసి సంతోషం వ్యక్తం చేశారు. ఆఫోటోలో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌ రావు, మంత్రి శ్రీనివాస్‌ గౌడ పలువురు ఉన్నారు. నుదిటిపై గులాబీ రంగులతో లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోద ముద్ర వేయడంతో ఆనందంతో విజయం సాధించామని సంతోషంతో వున్న ఫోటోను షేర్‌ చేశారు. అయితే మంత్రి తన సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ గా మారింది.
MLC Kavitha: సూర్యున్ని చూపిస్తూ కారులో కవిత.. అక్కడికి వెలుతున్న అంటూ ట్విట్‌

Show comments