NTV Telugu Site icon

Medico Preethi Health Bulletin: డాక్టర్ ప్రీతి పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల..

Preethi

Preethi

Medico Preethi Health Bulletin: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి బులెటిన్‌ విడుదల చేశారు హైదరాబాద్‌లోని నిమ్స్‌ వైద్యులు.. సీనియర్ విద్యార్థి వేధింపులలు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మెడికో పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. ప్రీతికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు బులెటిన్‌లో పేర్కొన్నారు.. ప్రీతికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని, చికిత్సకు ఆమె శరీరం ఏమాత్రం సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు.. బీపీ, పల్స్ రేటు నమోదు కాని పరిస్థితి ఏర్పడింది.. ప్రీతికి ఐదుగురు వైద్యుల బృందం చికిత్స అందిస్తోందని వెల్లడించారు.. ప్రీతి నిమ్స్ లో జాయిన్ అయ్యేటప్పటికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉందంటున్నారు వైద్యులు.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఎక్మో సపోర్ట్‌తో ట్రీట్మెంట్ చేస్తున్నామని.. కార్డియాక్, శ్వాస కోశ సమస్యలు ఉన్నాయని.. అన్ని డిపార్ట్మెంట్‌లు.. క్లోస్ మానటరింగ్ చేస్తున్నాయని బులెటిన్‌లో పేర్కొన్నారు నిమ్స్‌ వైద్యులు.

Read Also: Chandramukhi2: అమ్మ బాబోయ్.. లారెన్స్ ఈసారి గట్టిగా భయపెట్టేలా ఉన్నాడే

కాగా, హైదరాబాద్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్న నరేందర్ కూతురు ప్రీతి.. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు.. అయితే, విధుల్లో ఉన్నపుడే హానికరమైన ఇంజక్షన్ ను ఆమె తీసుకున్నారు.. తోటి వైద్యులు ఈ విషయం గమనించి ఆమెకు చికిత్స అందించారు.. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కేఎంసీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కొంత మంది విద్యార్థులు ఆరోపిస్తున్నారు.. ఇక, ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో.. నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Show comments