Site icon NTV Telugu

NIloufer Hospital Incident: వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం లేదు

నీలోఫర్ ఆస్పత్రి నవజాత శిశువులు, వివిధ ఇబ్బందులతో వున్న చిన్నారులకు భరోసా కల్పించే ప్రభుత్వాసుపత్రి. ఎంతో చరిత్ర వున్న ఈ ఆస్పత్రిలో అప్పుడప్పుడు వైద్యం అందక చిన్నారులు మరణిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నీలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి వివాదం రేపింది. ఆస్పత్రిలో ఉదయం ఇద్దరు చిన్నారులకు ఇంజక్షన్లు ఇచ్చింది నర్స్. అయితే, ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే ఇద్దరు పిల్లలు చనిపోయారంటున్నారు తల్లిదండ్రులు. ఆస్పత్రికి వచ్చేసరికే ఆరోగ్యం విషమించిందని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు.

ఈ ఘటనపై వివరణ ఇచ్చారు నీలోఫర్ సూపరింటెండెంట్ మురళీ కృష్ణ. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోజుల వయస్సున్న ఒక శిశువు మరణించింది. నాగర్ కర్నూలు నుంచి మూడు రోజుల క్రితం శిశువుని నీలోఫర్ కు తల్లిదండ్రులు తీసుకువచ్చారు. 28 నెలలు మాత్రమే నిండి ఒక కేజీ బరువుతో మాత్రమే శిశువు జన్మించింది. అవయవాలు పూర్తి స్థాయిలో పెరగకపోవడం మరణానికి కారణం. 50శాతం మంది నెలలు నిండని శిశువులు మరణిస్తారు. ఇందులో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం లేదు. బేబీని కాపాడేందుకు అత్యవసరమైన ఇంజక్షన్ ఇచ్చినా బ్రతకలేదన్నారు మురళీ కృష్ణ.

https://ntvtelugu.com/swachha-hyderabad-target-minister-ktr/
Exit mobile version