హైదరాబాద్ నడిబొడ్డులోని బేగంపేట్‌లో ఓ ఆడిటర్ కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. అయితే, ఆడిటర్ సాంబశివరావు కిడ్నాప్ కేసులు కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. ఆస్తితగాదాల నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ డ్రామా ఆడారని తెలుస్తోంది.. కిడ్నాపర్లతో కలిసి బాధితుడి మేనబావే ఈ స్కెచ్ వేశారని చెబుతున్నారు పోలీసులు.. ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసిన సాంబశివరావు.. అప్పులోళ్లు వేధింపులు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయారట.. ఇక, మీ భర్తను ఎవరో కిడ్నాప్ చేశారంటూ భార్యకు సమాచారం ఇవ్వడంతో.. ఆందోళనకు గురైన భార్య, కుటుంబసభ్యులు.. వెంటనే బేగంపేట్ పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశారు.. సాయంత్రానికి సీన్ మారిపోయింది.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని భార్యకు వీడియో కాల్ చేశారు సాంబశివరావు.. దీంతో.. పోలీసులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.. అప్పు ఇచ్చినవారి నుంచి తప్పించుకోవడానికి ఈ డ్రామా ఆడినట్టుగా చెబుతున్నారు పోలీసులు.
బేగంపేట్ ఆడిటర్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్..

Kidnapping