NTV Telugu Site icon

New Traffic Rules: నేటి నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌.. ఇవి పాటించకపోతే బాదుడే బాదుడు..

New Traffic Rules

New Traffic Rules

హైదరాబాద్‌లో ట్రాఫిక్స్‌ నిబంధనలు మారిపోయాయి… ఇప్పటివరకు ఒక లెక్కా.. ఇక ఇప్పటి నుంచి ఒక లెక్కా అన్నట్టుగా.. ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి.. పెరిగిపోతున్న ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. దానిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా.. కొత్త రూల్స్‌ తీసుకొచ్చారు.. ఇప్పటి వరకు సిగ్నల్‌ వద్ద స్టాప్‌ లైన్‌ క్రాస్‌ చేసినా.. ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్‌ చేసినా చూసి చూడనట్లు వదిలేస్తున్న పోలీసులు.. ఇప్పుడు కఠినంగా వ్యవహరించనున్నారు.. ఇక నుంచి సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠినచర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు.

Read Also: Bathukamma Festival: నేటితో ముగియనున్న బతుకమ్మ వేడుకలు.. సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

కొత్త నిబంధ‌న‌ల్లో భాగంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వ‌ద్ద వాహ‌నదారులు నిర్దేశిత నిబంధ‌న‌లు పాటించాల్సిందేన‌ని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.. సిగ్నళ్ల వ‌ద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 జ‌రిమానా విధించనున్నట్టు ప్రకటించారు.. ఇక, సిగ్నళ్ల వ‌ద్ద ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే ఏకంగా రూ.1,000 ఫైన్‌ పడనుంది.. మరోవైపు, పాద‌చారుల‌కు అడ్డంగా వాహ‌నాలు నిలిపే వారికి రూ.600 జ‌రిమానా వడ్డించనున్నారు.. ఫుట్‌పాత్‌ల‌పై వ‌స్తువులు పెట్టే దుకాణ‌దారుల‌పైనా భారీగా జ‌రిమానాలు విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. రాంగ్‌ పార్కింగ్‌లో ఫోర్‌ వీలర్‌కు రూ.600 జరిమానా.. బైక్‌లకు కూడా జరిమినా విధించనున్నారు.. హెల్మెట్ లేకున్నా, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా, మితి మీరిన వేగంతో దూసుకెళ్లినా, నో పార్కింగ్ జోన్‌లో వాహ‌నాలు నిలిపినా ఇలా.. అనేక రకాలుగా ఫైన్‌ విధిస్తూ వచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్‌ను అతిక్రమించినా.. ఫైన్‌ వేయనున్నారు.. అంటే రూల్స్‌ పాటించకపోతే జేబుకు చిల్లు పడడం ఖాయం.. మరి ట్రాఫిక్‌ రూల్స్‌ని పాటిద్దాం.. ఫైన్ల నుంచి తప్పించుకోవడమే కాదు.. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా సహకరించడంతో పాటు ప్రమాదాలను కూడా తగ్గించేందుకు మన వంతు తోడ్పాడు అందిద్దాం.

Show comments