NTV Telugu Site icon

Dowry Harassment: మైలార్ దేవ్ పల్లిలో విషాదం.. అత్తింటి వేధింపులకు నవవధువు ఆత్మహత్య

Dowry

Dowry

Dowry Harassment: ఎన్నో ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టింది. అయితే ఆ ఆశలన్నీ నిరాశనే మిగిల్చాయి. కొన్నినెలలు ఆనందంగా సాగిన వారిజీవితంలో వరకట్న వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నంకోసం భర్త మానసికంగా.. శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. పుట్టింటి వారికి చెబితే బాధపడతారని చెప్పలేక నరకయాతన పడింది. భర్తతో పాటు అత్తమామ తోడవడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో భరించలేక సహకోల్పోయిన వధువు ఆత్మహత్య చేసుకుంది. పుట్టింటి వారికి పుట్టెడు దుఖం మిగిల్చింది. ఈఘటన మైలార్ దేవ్‌పల్లిలో జరిగింది.

Read also: Roller Coaster: పాడై పోయిన రోలర్ కోస్టర్.. మూడు గంటల పాటు తలకిందులుగా వేలాడారు

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో నవ వధువు కవిత ఆత్మహత్య కలకలం రేపింది. గత ఏడు నెలల క్రితం కాటేదాన్ నేతాజీ నగర్ కు చెందిన చంద్ర శేఖర్ తో వివాహం జరిగింది. వివాహం అయిన కొన్ని రోజులకే తన అసలు రూపం బయట పెట్టాడు. అదనపు కట్నం తేవాలని వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. భర్తకు వేధింపులకు తోడు అత్తా, మామలతో పాటు ఆడపడుచు సూటి పొటి మాటలు ఎక్కువయ్యాయి. సహనం కోల్పోయిన కవిత తనువు చాలించాలని అనుకుంది. గదిలోకి వెళ్లి ఫ్యాన్‌ కు ఉరివేసుకుని బలవన్మరణంకు పాల్పడ్డ కవిత. ఎంతసేపు గది నుంచి కవిత రాకపోయే సరికి భర్త చంద్ర శేఖర్ వెళ్లి చూడగా కవిత ఫ్యాన్‌ కు వేళాడుతూ కనిపించింది.

దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో భయాందోళన చెందిన అత్తింటి వారు కవిత కుటుంబానికి కవిత చనిపోయినట్లు కాల్‌ చేసి చెప్పారు. షాక్‌ కు గురైన కవిత తల్లిదండ్రులు హుటా హుటిన కవిత అత్తింటి చేరుకున్నారు. కవిత విగత జీవిగ పడిఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. కవిత ఎలా చనిపోయిందంటూ ప్రశ్నించారు. మొన్నటి వరకు బాగున్న కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని నిలదీశారు. భర్త, అత్తింటి వారు ఏమీ చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మైలార్ దేవ్ పల్లి పోలీసులు నలుగురిపై 304 B సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఇంటికి మల్కాజ్గిరి డిసిపి చేరుకున్నారు. కవిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కవిత గురించి అడిగి తెలుసుకున్నారు.
Andhrapradesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులు మంజూరు