Site icon NTV Telugu

Baby in a Thornbush: కామారెడ్డి జిల్లాలో దారుణం.. ముళ్ళ పొదల్లో నవ శిశువు

Nws Born Beby

Nws Born Beby

New born baby in the thorn bushes in Kamareddy district: మానవత్వం నశిస్తుంది. తల్లి అన్న పిలుపు కనుమరుగైపోతోంది. కన్న బిడ్డలనే కడతేర్చే కర్కసత్వానికి తెరలేపుతుంది. అమ్మ అనే పదం అమ్మతనానికి మచ్చగామారుతోంది. ఆతల్లి చేసిందో లేక ఆమాతృ మూర్తినుంచి వేరుచేయడానికి ఎవరైనా ఇలా చేశారో తెలియదు కానీ ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన పసి హృదయం ఆర్తనాదాలు అందరిని కలిచివేదసింది. ముళ్లపొదల్లో ఆపసి బడ్డ ఏడుస్తూన్న తీరు చూసిన వారి కంటకన్నీరు ఆగలేదు. ఈఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Tractor overturned: పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా.. మొత్తం 26 మంది

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పిస్కాల్ తండా శివారులో అప్పుడే పుట్టిన బిడ్డ ఉండటం కలకలం రేపింది. తండా శివారులోని ముళ్ళ పొదలలో నవ జాతి శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు. ఆముళ్లు గుచ్చుకుని ఆశిశువు ఎంత అల్లాడిపోయింది. ఆనొప్పని భరించలేక శిశువు అమ్మా అంటూ అరుపులు మిన్నంటాయి. పసిబిడ్డ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని స్థానికులు వెతికారు. అయితే శిశువు అరుపులు మున్నపొదల్లో నుంచి రావడంతో తల్లడిల్లారు. శిశువును హక్కున చేర్చకుని ఐసిడిఎస్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న ఐసిడిఎస్ అధికారులు చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో నవ శిశువుకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రోడ్డు పక్కన ఎవరు వదిలేసి వెళ్లారు అని? వివాహేత సంబంధమా? లేక ఇతర కారణాల వల్ల అప్పుడే పుట్టిన బిడ్డను ముళ్లపొదల్లో ఎందుకు వదిలేశారనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.
Tamil Nadu: ఉదయనిధి స్టాలిన్ “ప్లేబాయ్”గానే మిగిలిపోతాడు.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version