గచ్చిబౌలి లో మరోసారి రెచ్చిపోయారు నేపాలీ పనిమనుషులు. రాయదుర్గం పీయస్ పరిదిలోని టెలికం నగర్ లో ఉంటున్న గోవింద్ పటేల్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంటి యాజమాని గోవింద్ పటేల్ మాట్లాడుతూ… తమ ఇంట్లో నాలుగు నెలల క్రితం నేపాల్ కు చెందిన లక్ష్మణ్, పవిత్ర లు పనిమనుషులుగా చేరారు. శనివారం శ్రీశైలం వెళ్ళి, ఆదివారం వచ్చే సరికే చోరీ జరిగింది. కిలో బంగారు ఆభరణాలు, 15 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. కిటికీ గ్రిల్ తొలగించి, లాకర్ పగులగొట్టి చోరీ చేశారు అని తెలిపారు. వాచ్ మెన్ ఫ్యామిలీ ఎవరూ కనపడకపోవడంతో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసారు బాధితులు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.