NTV Telugu Site icon

అందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి…

వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.  అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు కేవలం దేశంలో 4 శాతం మందికి మాత్ర‌మే వ్యాక్సిన్ అందించార‌ని, ప్ర‌తి ఒక్క‌రికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాల‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ డిమాండ్ చేశారు.  ఈరోజు తెలంగాణ‌లోని జిల్లాల్లో క‌లెక్ట‌ర్ల‌కు విన‌తి ప‌త్రాలు ఇవ్వాల‌ని, 7 వ‌తేదీన గాంధీభ‌వ‌న్ తో పాటు, జిల్లా కేంద్రాల్లో ఉదయం 9గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం ఒంటిగంత వ‌ర‌కు స‌త్యాగ్ర‌హ దీక్ష‌లు చేప‌ట్టాల‌ని మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు.  స‌త్యాగ్ర‌హ దీక్ష‌ల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఠాగూర్ తెలిపారు.