NTV Telugu Site icon

Naveen father: పేపర్ లీకేజ్ తో నవీన్ కి సంబంధం లేదు.. దయచేసి శవరాజకీయాలు చేయకండి

Naveen Father

Naveen Father

Naveen father:రాజన్న సిరిసిల్ల జిల్లా నవీన్ కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను నవీన్ తండ్రి నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి శవరాజకీయాలు చేయకండి అని దండం పెట్టి విజ్ఞప్తి చేశారు. మీరు ఇవ్వాళ వస్తారు పోతారు, మాకు అండగా ఉండేది మంత్రి కేటీఆర్ మాత్రమే అని బాధిత కుటుంబీకులు తేల్చి చెప్పారు. దీంతో ఎమ్మల్సీ జీవన్‌ రెడ్డి వెనుతిరిగారు.

నవీన్‌ తండ్రికి మంత్రి కేటీఆర్‌ ఫోన్‌..

ఆత్మహత్య చేసుకున్న చిటికెన నవీన్‌కుమార్‌ కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్‌ ఫోన్‌లో పరామర్శించారు. అధైర్య పడవద్దని, మీ కుటుంబానికి అండగా ఉంటామని నవీన్‌ తండ్రి నాగభూషణరావుకు ధైర్యం చెప్పారు. నవీన్‌ అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలతోపాటు కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

నవీన్‌కుమార్‌ తండ్రి నాగభూషణం

గ్రూప్స్‌ రాయలన్న ఉద్దేశమే మా కొడుక్కు లేదని, నవీన్‌కుమార్‌ మృతికి గ్రూప్స్‌ పరీక్షలతో గానీ, లీకేజీలతో గానీ సంబంధం లేదని తేల్చి చెప్పాడు. నవీన్‌ మృతి చెందడంతో పుట్టెడు దుఖంతో మేముంటే, ఇష్టానుసారం బయట మాట్లాడుతున్నరు. మాకు సంబంధం లేకుండానే కొంతమంది నాయకులు వారి ఇష్టమొచ్చినట్టు ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. నవీన్‌ నిజానికి ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడని, నవీన్‌ ఇంటర్‌ పూర్తిచేసిన తరువాత హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు మూడేండ్లు చదివాడని అన్నారు. ఇక అక్కడే ఒక హోటల్‌లో కొద్ది రోజులు ఉద్యోగం చేశాడని, ఆ తరువాత సిరిసిల్ల రిలయన్స్‌ ట్రెండ్స్‌లో చేశాడని పేర్కొన్నారు. మూడు నెలల క్రితం అక్కడ మానేసిన నవీన్‌ ఒక ప్రైవేట్‌ బ్యాంకులో ఔట్‌సోర్సింగ్‌ కింద క్లర్క్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడని, ఇంటర్వ్యూ కూడా అయ్యిందని, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ తమ బ్యాంకు నిబంధనలకు సరిపోదని చెప్పడంతో కొంత మానసికంగా ఇబ్బంది పడ్డాడని తెలిపారు. ‘ఇది కాకపోతే ఇంకో జాబు చూసుకో బిడ్డా’ అని మేం చెప్పిన్నామని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కన్నీరు పెట్టుకున్నారు. నవీన్‌ మృతిని రాజకీయం చేయాలని చూస్తున్న మాట వాస్తవమే. లీకేజీలకు గానీ ఎటువంటి సంబంధం లేదు. అసలు గ్రూప్స్‌ రాయలన్న ఉద్దేశమే మా కొడుక్కు లేదని స్పష్టం చేశారు నవీన్‌ తండ్రి.

గ్రూప్‌1 కు ప్రిపేర్‌ అవుతున్నది అన్న రాజు.. తమ్ముడు నవీన్‌ కాదు?

నవీన్‌ నా తమ్ముడు మేమిద్దరం ఎప్పడు ప్రెండ్స్‌ లాగే ఉంటాము.. ఎందుకు అత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదు. నిజానికి గ్రూప్‌-1కు నేను ప్రిపేర్‌ అవుతున్నా.. మా తమ్ముడు గ్రూప్‌-1కు దరఖాస్తే చేయలేదు. అతనికి సాఫ్ట్‌వేర్‌ వైపు దృష్టి మళ్లింది. ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి కోర్సులు చేస్తున్నాడు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. రాజకీయాల కోసం మా తమ్ముడి మరణాన్ని వాడుకోవడం బాధగా ఉన్నది.

నవీన్‌కుమార్‌ మృతి

సిరిసిల్ల పట్టణానికి చెందిన చిటికెన నవీన్‌కుమార్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసి, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేశాడు. ఇటీవల ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇంటర్వ్యూకు వెళ్లివచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్‌-1కు ప్రిపేరైన సిరిసిల్లకు చెందిన నవీన్‌కుమార్‌ తాజా లీకేజీ పరిణామాలతో మనస్తాపానికి గురై ఉరికొయ్యకు వేలాడాడు అంటూ నవీన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని. రూ.కోటి పరిహారం ఇవ్వాలని కొంతరు రాజకీయ నాయకులు నవీన్‌ కుటుంబానికి అండగా ఉంటుందంటూ పీసీసీ అధ్యక్షుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిని ప్రభుత్వ హత్యగా పరిగణించి, మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదుచేయాలని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్‌ మీడియా సమావేశం పెట్టి మరీ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే..
Bus Falls into Ditch: కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 16మంది మృతి, 30 మందికి గాయాలు

Show comments