Naveen father: పేపర్ లీకేజ్ తో నవీన్ కి సంబంధం లేదు.. దయచేసి శవరాజకీయాలు చేయకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naveen father:రాజన్న సిరిసిల్ల జిల్లా నవీన్ కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను నవీన్ తండ్రి నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి శవరాజకీయాలు చేయకండి అని దండం పెట్టి విజ్ఞప్తి చేశారు. మీరు ఇవ్వాళ వస్తారు పోతారు, మాకు అండగా ఉండేది మంత్రి కేటీఆర్ మాత్రమే అని బాధిత కుటుంబీకులు తేల్చి చెప్పారు. దీంతో ఎమ్మల్సీ జీవన్ రెడ్డి వెనుతిరిగారు.
నవీన్ తండ్రికి మంత్రి కేటీఆర్ ఫోన్..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
ఆత్మహత్య చేసుకున్న చిటికెన నవీన్‌కుమార్ కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. అధైర్య పడవద్దని, మీ కుటుంబానికి అండగా ఉంటామని నవీన్ తండ్రి నాగభూషణరావుకు ధైర్యం చెప్పారు. నవీన్ అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలతోపాటు కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
నవీన్‌కుమార్ తండ్రి నాగభూషణం
గ్రూప్స్ రాయలన్న ఉద్దేశమే మా కొడుక్కు లేదని, నవీన్‌కుమార్ మృతికి గ్రూప్స్ పరీక్షలతో గానీ, లీకేజీలతో గానీ సంబంధం లేదని తేల్చి చెప్పాడు. నవీన్ మృతి చెందడంతో పుట్టెడు దుఖంతో మేముంటే, ఇష్టానుసారం బయట మాట్లాడుతున్నరు. మాకు సంబంధం లేకుండానే కొంతమంది నాయకులు వారి ఇష్టమొచ్చినట్టు ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. నవీన్ నిజానికి ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడని, నవీన్ ఇంటర్ పూర్తిచేసిన తరువాత హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు మూడేండ్లు చదివాడని అన్నారు. ఇక అక్కడే ఒక హోటల్‌లో కొద్ది రోజులు ఉద్యోగం చేశాడని, ఆ తరువాత సిరిసిల్ల రిలయన్స్ ట్రెండ్స్‌లో చేశాడని పేర్కొన్నారు. మూడు నెలల క్రితం అక్కడ మానేసిన నవీన్ ఒక ప్రైవేట్ బ్యాంకులో ఔట్‌సోర్సింగ్ కింద క్లర్క్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడని, ఇంటర్వ్యూ కూడా అయ్యిందని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ తమ బ్యాంకు నిబంధనలకు సరిపోదని చెప్పడంతో కొంత మానసికంగా ఇబ్బంది పడ్డాడని తెలిపారు. ‘ఇది కాకపోతే ఇంకో జాబు చూసుకో బిడ్డా’ అని మేం చెప్పిన్నామని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కన్నీరు పెట్టుకున్నారు. నవీన్ మృతిని రాజకీయం చేయాలని చూస్తున్న మాట వాస్తవమే. లీకేజీలకు గానీ ఎటువంటి సంబంధం లేదు. అసలు గ్రూప్స్ రాయలన్న ఉద్దేశమే మా కొడుక్కు లేదని స్పష్టం చేశారు నవీన్ తండ్రి.
గ్రూప్1 కు ప్రిపేర్ అవుతున్నది అన్న రాజు.. తమ్ముడు నవీన్ కాదు?
నవీన్ నా తమ్ముడు మేమిద్దరం ఎప్పడు ప్రెండ్స్ లాగే ఉంటాము.. ఎందుకు అత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదు. నిజానికి గ్రూప్-1కు నేను ప్రిపేర్ అవుతున్నా.. మా తమ్ముడు గ్రూప్-1కు దరఖాస్తే చేయలేదు. అతనికి సాఫ్ట్‌వేర్ వైపు దృష్టి మళ్లింది. ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి కోర్సులు చేస్తున్నాడు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. రాజకీయాల కోసం మా తమ్ముడి మరణాన్ని వాడుకోవడం బాధగా ఉన్నది.
నవీన్‌కుమార్ మృతి
సిరిసిల్ల పట్టణానికి చెందిన చిటికెన నవీన్‌కుమార్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేశాడు. ఇటీవల ఓ ప్రైవేట్ బ్యాంక్ ఇంటర్వ్యూకు వెళ్లివచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్-1కు ప్రిపేరైన సిరిసిల్లకు చెందిన నవీన్‌కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్తాపానికి గురై ఉరికొయ్యకు వేలాడాడు అంటూ నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని. రూ.కోటి పరిహారం ఇవ్వాలని కొంతరు రాజకీయ నాయకులు నవీన్ కుటుంబానికి అండగా ఉంటుందంటూ పీసీసీ అధ్యక్షుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని ప్రభుత్వ హత్యగా పరిగణించి, మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదుచేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్ మీడియా సమావేశం పెట్టి మరీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే..
Bus Falls into Ditch: కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 16మంది మృతి, 30 మందికి గాయాలు
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!