NTV Telugu Site icon

Sri chaitanya college: సాత్విక్ ఆత్మహత్య.. శ్రీచైతన్య కళాశాలకు శాశ్వత గుర్తింపు రద్దు

Arsing Srichitanya College

Arsing Srichitanya College

Sri chaitanya college: నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల గుర్తింపును తెలంగాణ ఇంటర్ బోర్డు శాశ్వతంగా రద్దు చేసింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు విచారణలో కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం కమిటీని వేసింది. ఈ కమిటీ తన ప్రాథమిక నివేదికను ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ వేధింపులు నిజమేనని కమిటీ తేల్చింది. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. సాత్విక్ మరణానికి కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్న లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నలుగురిని నార్సింగి పోలీసులు రాజేంద్రనగర్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని తమను వదిలిపెట్టవద్దని సూసైడ్ నోట్ లో సాత్విక్ కోరాడు.

Read also: Kishan Reddy:రూ.200 మందులు కొని రూ.21 ఫోన్‌ పే చేసిన కేంద్రమంత్రి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నివసిస్తున్న రాజప్రసాద్‌, అలివేలు దంపతుల చిన్న కుమారుడు సాత్విక్‌ శ్రీచైతన్య కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో ఇంటర్‌ చదువుతున్నాడు. కళాశాల హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సాత్విక్ ఆత్మహత్యకు కాలేజీ లెక్చరర్ల వేధింపులే కారణమని సాత్విక్ తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు. తక్కువ మార్కులు వచ్చాయని లెక్చరర్లు వేధిస్తున్నారని సాత్విక్ చెప్పినట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే సాత్విక్ కుటుంబ సభ్యులు, ఇతర విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
Minister KTR: మళ్లీ అధికారంలోకి వస్తాం.. దానికి నిదర్శనం మీ స్పందనే

Show comments