Site icon NTV Telugu

SI Rajender: ఎస్‌ఐ ఇంట్లో డ్రగ్స్.. ఈ పోలీసు మామూలోడు కాదు భయ్యా..

Si Rajender

Si Rajender

SI Rajender: డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై నిఘా ఉంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. గంజాయి దందాలను మట్టుకల్పించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అయితే.. ఖాకీవనంలో గంజాయి మెుక్కలా ఓ పోలీసు డ్రగ్స్‌తో పట్టుపడటం కలకలం రేపుతోంది. నార్కోటిక్స్ టీమ్ లో ఎస్సైగా పనిచేస్తున్న రాజేందర్ డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. దీంతో రాయదుర్గం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Read also: Bhumana Karunakar Reddy : తిరుపతి నగరవాసుల దశాబ్దాల నాటి సమస్య ఎట్టకేలకు పరిష్కారం

నార్కోటిక్స్ టీమ్ లో రాజేందర్ అనే ఎస్.ఐ ఎస్సైగా పనిచేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఓ ఆపరేషన్‌లో పాల్గొన్న రాజేందర్ అక్కడ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ వద్ద ఉన్న 1750 గ్రాముల మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా తన వెంట తెచ్చుకున్నాడు రాజేందర్. పట్టుబడిన డ్రగ్స్‌లో కొన్నింటిని కొట్టేసాడు. డ్రగ్ కోర్టులో అతనిని డిపాజిట్ చేసే సమయంలో తక్కువగా చూపించాడు. ఈ క్రమంలో తన ఇంట్లో దాచుకున్న మాదకద్రవ్యాలను విక్రయించేందుకు ప్రయత్నించాడు. రాష్ట్ర నార్కోటిక్ విభాగం పోలీసులకు సమాచారం అందింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతని ఇంట్లో సోదాలు చేశారు. రాయదుర్గం పీఎస్ పరిధిలో ఉండే రాజేందర్ ఇంట్లో దాడి చేసి 80 లక్షల రూపాయల విలువచేసే మాదకద్రవ్యాలను నార్కోటిక్ విభాగం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.

సోమవారం రాజేందర్ పై కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నాను రాయదుర్గం పోలీసులు. డ్రగ్స్ ను ఎందుకు దాచిపెట్టుకోవాల్సి వచ్చిందో ఆరా తీయనున్నారు. డ్రగ్స్ ను వినియోగించుకోవడం కోసమా? లేక అమ్మడం కోసమా? దాచి పెట్టిందినే అంశాలు దర్యాప్తులో తేలనున్నాయి. కొన్ని రోజుల తర్వాత డ్రగ్స్ విక్రయించాలని రాజేందర్ ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. రాయదుర్గం స్టేషన్‌లో ఎస్‌ఐ పనిచేస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆ తర్వాత ఉన్నతాధికారులు అతడిని సర్వీసు నుంచి తొలగించడంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. ఇటీవలే డ్రగ్స్ కేసులో అరెస్టయి కటకటాలపాలయ్యాడు.
Fake Pilot: అమ్మాయిల కోసమే పైలెట్ అవతారం.. పలువురిని మోసం చేసిన యువకుడు

Exit mobile version