Nandakumar: ఎమ్మెల్యే ల ఎర కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదల అయిన నందకుమార్ హైకోర్టు ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన జీహెచ్ ఎంసీ కమిషనర్, మరో ముగ్గురు టౌన్ ప్లానింగ్ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసును విధించింది. దీంతో.. హైకోర్ట్ లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ ను నందకుమార్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి తన పొజిషన్ లో వున్న బిల్డింగ్ ను కూల్చేశారు అంటూ నందకుమార్ హైకోర్ట్ ను ఆశ్రయించారు. GHMC కమిషనర్ లోకేష్ కుమార్, జూబ్లీహిల్స్ జోనల్ కమిషనర్ రవితేజ, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ లపై చర్యలు తీసుకోవాలని నందకుమార్ హైకోర్ట్ ను కోరారు. గత ఏడాది నవంబర్ 11న రిట్ పిటిషన్ 18529/ 2021, మరో రిట్ పిటిషన్ 18645/2021 లో.. హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదని నందకుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
Read also: Variety Thief: అట్టముక్కతో దొంగతనం.. అడ్డంగా దొరికిపోయిన దొంగ
ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌లకు బెయిల్ మంజూరు కావడంతో పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. బోగస్ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కేసులో రామచంద్ర భారతిని, బంజారాహిల్స్‌లో నమోదైన మోసం కేసులో నందకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దోమ మండలంలో భూమి విషయంలో సతీష్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడన్న ఫిర్యాదు మేరకు నందకుమార్‌పై ఐపీసీ సెక్షన్ 386, 387 కింద కేసు నమోదు చేశారు. అప్పట్లో వీరి అరెస్ట్ కూడా ఆసక్తికరంగా మారింది. మొయినాబాద్ ఫాంహౌస్ సెంటర్‌లో జరిగిన ఎమ్మెల్యేల కేసులో ఏ1 రామచంద్ర భారతి, ఏ2 నందకుమార్‌లు నాంపల్లి కోర్టులో ఒక్కొక్కరు రూ.6 లక్షల పూచీకత్తు సమర్పించడంతో బెయిల్ మంజూరైంది. నిందితులు డిసెంబర్ 8న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.ఇదే కేసులో సింహయాజీకి కూడా బెయిల్ మంజూరైంది. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. రూ.6 లక్షల పూచీకత్తు మరియు ఇద్దరు పూచీకత్తులను సమర్పించిన తర్వాత సింహయాజీ న్యాయవాది విడుదలయ్యారు. దాదాపు నెల రోజుల తర్వాత నందకుమార్ రెండో కేసులో బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.
Mumbai : ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసినందుకు భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..