Multi Level Parking : హైదరాబాద్ వాసులను ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న వాహనాల పార్కింగ్ సమస్యకు త్వరలోనే పరిష్కారం రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నాంపల్లి హృదయభాగంలో అత్యాధునిక మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. ఈ సౌకర్యం ప్రారంభమైతే నగర కేంద్ర ప్రాంతంలో పార్కింగ్ సమస్యలకు శాశ్వతంగా చెక్ పడనుంది.
సుమారు రూ.100 కోట్ల వ్యయంతో, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ కాంప్లెక్స్ దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్ టెక్నాలజీతో అమలు చేయబడింది. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలను సురక్షితంగా నిల్వ చేయగల సౌకర్యాన్ని అందించే ఈ ప్రాజెక్టు, నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడింది.
TTD: తిరుమలకు వెళ్లే వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై అది లేకుంటే నో ఎంట్రీ..!
మొత్తం 15 అంతస్తులతో నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో 3 బేస్‌మెంట్లు, 7 పైఅంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. మిగతా 5 అంతస్తుల్లో ఆధునిక కమర్షియల్ షాపులు, రెండు సౌకర్యవంతమైన సినిమాహాళ్లు ఏర్పాటయ్యాయి. 11వ అంతస్తులో నగర అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక వీక్షణ గ్యాలరీను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 200 పైగా కార్లు, 200 వరకు రెండు చక్రాల వాహనాలు ఒకేసారి పార్క్ చేసుకునే అవకాశం ఈ కాంప్లెక్స్‌లో లభించనుంది.
ప్రాజెక్టు పూర్తిగా ఆపరేషన్‌లోకి రాగానే నాంపల్లి ప్రాంతంతో పాటు సెంట్రల్ హైదరాబాద్‌లోని ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది నగర రవాణా సౌకర్యాల్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
