Smuggling : నాంపల్లి ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో అధికారులు 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. STF ఏ-టీమ్ లీడర్ అంజిరెడ్డి అందించిన సమాచారం మేరకు సిబ్బంది సమన్వయంతో ఈ దాడులు జరిగాయి. తనిఖీల్లో గంజాయితో పాటు ఒక టు-వీలర్, సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో హట్ గోడకు చెందిన సంజయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Raviteja: ఇది కదా డెడికేషన్ అంటే.. గాయంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లే ముందు షూట్..
దాడుల సమయంలో గంజాయి రవాణా, విక్రయాల్లో భాగమైన శేఖర్ బాబు, కామ్రే బాబు, గంగోలి బహు అనే ముగ్గురు వ్యక్తులు పారిపోయారని అధికారులు తెలిపారు. వీరిపై కూడా కేసు నమోదు చేసి గాలింపు కొనసాగిస్తున్నట్లు అంజిరెడ్డి వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితుడు సంజయ్‌తో పాటు స్వాధీనం చేసిన గంజాయి, వస్తువులను నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్టిఎఫ్ అధికారులు తెలిపారు. నగరంలో నిషేధిత మాదక ద్రవ్యాల విక్రయాలపై దృష్టి సారించి మరిన్ని దాడులు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.
Viral Video: మహిళను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి.. ఒడిశా వీడియో వైరల్..
