NTV Telugu Site icon

Nampally Court: ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

బీజేపీ నేత, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు.. గతంలో టీఆర్ఎస్‌ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను చించివేయడం.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ని దుర్బాషలాడిన కేసు విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈ కేసులో ఎంపీ అర్వింద్‌ విచారణకు హాజరుకాని కారణంగా నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌ ఇష్యూ చేసింది..

Read Also: KCR: కొల్హాపూర్‌లో కేసీఆర్‌ దంపతులు.. శ్రీ మహాలక్ష్మీకి ప్రత్యేక పూజలు

కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా… 2020 నవంబర్‌ 23వ తేదీన కేబీఆర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌ పార్టీ ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీలను, హోర్డింగ్‌లను ఎంపీ అర్వింద్‌ మరియు అతని అనుచరులు చింపివేశారంటూ కేసు నమోదైంది.. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ని అనేక రకాలుగా తిడుతూ నానా దుర్బాసాలడారని ఫిర్యాదు చేశారు.. అప్పట్లో టీఆర్ఎస్‌ పార్టీ సెక్రెటరీ హోదాలో ఉన్న ఇప్పటి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. ధర్మపురి అర్వింద్‌పై కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.. అయితే, ఆ కేసులో సాక్షుల విచారణ పూర్తై.. 313 ఎక్సమినేషన్ కి తప్పని సరి రావాల్సిన ఉన్నా.. అర్వింద్‌ రాకపోవడంతో ఈ రోజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు.. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వెంటనే అర్వింద్‌ను అరెస్ట్‌ చేయాలంటూ పోలీసులకు సూచించింది నాంపల్లి కోర్టు. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.