ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగంపై కేంద్రం కక్ష్య కట్టిందని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికి అన్ని రకాలుగా తీసుకు వెళ్లామని ఆయన అన్నారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అభివృద్ధిలో అడ్డంకులు, రైతుల ధాన్యం కొనడానికి అడ్డంకులు.. అన్నింటికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. రైతులు ఇళ్లపై నల్ల జెండాలతో నిరసన తెలిపారని ఆయన వెల్లడించారు.
వరి పంటలో భారత్ నెంబర్ వన్ గా ఉందని, తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్రంలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట చెప్తున్నారని ఆయన విమర్శించారు. రైతులను అవమాన పరుస్తున్నారని, తెలంగాణ పై ఎందుకింత కక్ష్య సాధింపు అంటూ ఆయన ధ్వజమెత్తారు. భారత్‌లో తెలంగాణ లేదా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచేంత వరకు పోరాటం చేస్తామని, రాబోయే కాలంలో కేంద్రానికి బుద్ది చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.
https://ntvtelugu.com/vijayashanthi-fired-on-ts-paddy-procurement/
