రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ‘విహారి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును పక్కన నిలిపేశాడు. రు. అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకొని బయటికి దూకారు. తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Also:Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా టీవీ నటి, యాంకర్
పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి దగ్గర ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బస్సులో నుంచి పొగలు రావడంతో.. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కన ఆపేశాడు. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదానికి 10 నిమిషాల ముందే బస్సును టీకోసం ఆపారు. టీ తాగిన అనంతరం బస్సు బయలు దేరిన కొద్ది సేపటికే బస్సులో నుంచి పొగలు రావడంతో.. డైవర్ స్పందించి పక్కకు నిలిపేశాడు. వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేశాడు. వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు సిబ్బంది.
