Nagarjuna Sagar: జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో పది గేట్లు ఎత్తిన అధికారులు దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో అధికారులు సోమవారం ఉదయం ఆరు గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రికి డ్యాం నిండిపోవడంతో 10 గేట్లను ఎత్తారు. అయితే మంగళవారం ఉదయం వరకు శ్రీశైలం నుంచి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో అప్రమత్తమైన అధికారులు సాగర్ 22 గేట్లను ఎత్తారు. ఇందులో 4 గేట్లను 5 అడుగులు, 16 గేట్లను 10 అడుగుల మేర, ఇవాళ మరో రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ కు ఇన్ ఫ్లో 3,00,530 క్యూసెక్కులుగా ఉంది. క్రస్ట్ గేట్ల ద్వారా ఔట్ ఫ్లో 2,54,460 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 585.80 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. మరోవైపు 312.5 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 296.85 టీఎంసీలకు చేరింది.
Read also: Nagendra Babu: సినిమా పరిశ్రమ ఎవడబ్బ సొత్తుకాదు..ఇక్కడ టాలెంట్ ముఖ్యం..
సాగర్ కు ప్రత్యేక బస్సులు..
దీంతో సాగర్ అందాలను చూసేందుకు వెళ్లే పర్యాటకుల తాకిడి పెరిగింది. కానీ హైదరాబాద్ నగరానికి శ్రీశైలం కంటే సాగర్ సమీపంలో ఉండటంతో ఎక్కువ మంది పర్యాటకులు సాగర్ వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి టీజీ ఆర్టీసీ శుభవార్త అందించింది. నగరంలోని ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి నేరుగా సాగర్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. నల్గొండ డిపో పరిధిలో నడిచే ఈ సర్వీసులు.. ఉదయం 5, 6.45, 7. 15, 7.30, 8, 9.45, 10.45 నిమిషాలకు.. తరువాత మధ్యాహ్నం 2.30 మరియు సాయంత్రం 5, 5.40 గంటలకు డీలక్స్ బస్సులు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి నేరుగా సాగర్‌కు వెళ్తాయి. సాగర్ వెళ్లాలనుకునే సందర్శకులు టీజీ ఆర్టీసీ సేవలను వినియోగించుకుని సుఖంగా, సురక్షితంగా ప్రయాణం సాగించాలని ఆర్టీసీ అధికారులు కోరారు.
Amazon Offers: అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్!