Nagarjuna Sagar: సాగర్ 26 గేట్లలో 16 గేట్లు మూసిన వేత.. 10 గేట్ల ద్వారా నీటిని విడుదల
- నాగార్జునసాగర్ జలాశయానికి స్వల్పంగా తగ్గిన వరద..
- సాగర్ గేట్లను 26 గేట్లలో 16 గేట్లు మూసి వేశారు ప్రాజెక్ట్ అధికారులు..
- 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం, సుంకేశుల నుంచి స్థిరంగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ గేట్లను 26 గేట్లలో 16 గేట్లు మూసి వేశారు ప్రాజెక్ట్ అధికారులు. 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో : 1,17,7395 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : 1,17,7395 క్యూసెక్కులు. ప్రస్తుత నీటిమట్టం : 587.30 అడుగులు. పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు. ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం : 305 టీఎంసీలు కాగా.. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం : 312.5050 టీఎంసీలుగా కొనసాగుతుంది.
Read also: Narsingi Crime: మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజనీర్లకు తీవ్ర గాయాలు..
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
ప్రాజెక్టులో జలకళ సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ కొనసాగుతోంది. సాగర్ అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ రిజర్వాయర్ గేట్ల నుంచి వదులుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు తమ ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ పరవశిస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో, మరికొందరు స్నేహితులతో కలిసి సాగర్ అందాలను చూసేందుకు వస్తున్నారు. ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. వాతావరణం కూడా చల్లగా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సాగర్ కు చేరుకుంటున్నారు. నీటి ఎద్దడితో సాగర్ డ్యామ్‌ను చూడటం చాలా సంతోషంగా ఉందని పలువురు పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. జలాశయం వద్ద రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Social Media Posts: అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత పోస్టులు.. నిందితుడు అరెస్ట్..
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?