Munugode: తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, ప్రభుత్వం ఎన్ని రూల్స్ పెట్టిన కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. కర్కశ పోలీసులు అమాయకులు, రైతులు, పేదలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలోని మునుగోడు పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కోటి సింగ్ ఓ రైతుపై వీరంగం సృష్టించాడు. ముత్యాలు అనే రైతును చితక బాదాడు.. మునుగోడు మండల కేంద్రంలో ఇద్దరు రైతుల మద్య గత కొంత కాలంగా భూ వివాదం కొనసాగుతుంది. ఈ వివాదం నేపథ్యంలో కంప్లైంట్ రావడంతో రైతు ముత్యాలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: Papikondalu Tour: పాపికొండలు విహారయాత్ర ప్రారంభం.. బయల్దేరిన తొలి బోటు
అయితే, పొలం పనులు ముగించుకుని వస్తానని రైతు ముత్యాలు ఏఎస్ఐ కోటి సింగ్ ని ప్రాధేయపడ్డాడు. దాంతో నాకే ఎదురు చెబుతావా అంటూ కోపంతో సదరు రైతుపై కుటుంబ సభ్యుల ముందే చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ రైతు ముత్యాలు కుటుంబ సభ్యులు ఏఎస్ఐ కోటి సింగ్ పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అనవసరంగా తనపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఇక, ఏఎస్ఐ తీరుపై పైఅధికారులు తీవ్రంగా మండిపడ్డారు. మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.