Yadadri Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం భైతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అయితే, మృతులు అందరూ ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.
Read Also: Cambodia-Thailand War: కంబోడియా కీలక విజ్ఞప్తి.. థాయ్‌లాండ్ తిరకాసు..! ఏం జరుగుతుందో!
ఇక, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, స్కార్పియో వాహనం అదుపు తప్పి ముందున్న డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. వాహనం ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే, మృతుల్లో ఇద్దరు ఏపీ డీఎస్పీలు శాంతారావు, మేక చక్రధర్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో డ్యూటీ చేస్తున్నారు.
Read Also: Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ ముఠాను అరెస్ట్ చేసిన SOT బృందం..!
కాగా, ప్రమాదంలో మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక, డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉంది.. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
